Te:NeMo-BrowserID

From MozillaWiki
Jump to: navigation, search

నెమో వ్యాస అధోభాగము
బ్రౌజర్ ఐడి
మరల వ్యాస అధోభాగమునకు | ముఖ్య పేజి
హీన కౌసర్ (Heena Kausar)
అనుష (Anusha)
రమ్య (Ramya)

బ్రౌజర్ ఐడి

ఈ పేరు చాల కొత్తగా ఉంది. చాల మంది లో ఈ పేరు వినగానే వివిధ రకమైన భావాలూ కలిగాయి . ఇది మొజిల్లా యొక్క ప్రసిధి చెందినా ప్రాజెక్ట్ అసలు. వాస్తవం ఏమిటంటే ఫైరుఫాక్సు బ్రౌజరు తో లేదా దాని గుర్తింపుతో మనం చేయడానికి ఏమి లేదు. మనం సైన్ అప్ (sign up) చేసే విధాన్నాన్ని సులువుగా చేయడానికి మరియు వెబ్ సైట్ లలో,పోర్టల్స్ లో మన గుర్తింపులను నిర్వహించడానికి మొజిల్లా ప్రయత్నిస్తుంది.

నిన్న మధ్యానం, మా నాన్న కు ఒక భీమ బృందం లో చేర్చుటకు ఒక పత్రము లో వివరాలు క్లుప్తంగా నింపుటకు సహకరిస్తునప్పుడు ఆ విధానం నాకు ఏ మాత్రం సులువుగా అనిపించలేదు. అందులో అందుబాటులో ఉన్న యూసర్ నేమ్ ను ఎంపిక చేసి కాప్త్చ(captcha) నింపి ఈమెయిలు లోకి వెళ్లి ఆ భీమ వారు పంపిన లింక్ ను క్లిక్ చేసాక పాస్వర్డ్ నింపి అకౌంట్ సృష్టించేసరికి మా నాన్న గాఢ నిద్రలోకి జారిపోయారు..:P

నేను మా ఎకౌంటు గుర్తింపు కోసం కొంత సమయం ఈ సాధరణ దశలో ఉన్నాను. అప్పుడే మా బావ నా తో మాట్లాడ్డానికి వచ్హాడు. నేను పడుతున్న కష్టాన్ని చూసీ బ్రౌజరు ఐడి గురించి వివరించాడు. ఇది వినియోగదారులకు చాల భద్రతా మరియు వికేంద్రీకరణ ను కలిపిస్తుందని , మీ ఈమెయిలు ఐడి మీ ప్రాథమిక గుర్తింపు గా ప్రవర్తిస్తుందని వివరించాడు.

హాయ్ టు బ్రౌసర్ ఐడి!!

బ్రౌజరు ఐ డి మొజిల్లా లాబ్స్ లో ఒక ప్రయోగం లా మొదలైంది ఆ తర్వాత ప్రాజెక్టు గురించి సమీక్షలు జర్పుకొని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రాజెక్ట్ టీం యొక్క ప్రేరణ ఎంతో సహకరించింది. ఈ ప్రయోగానికి విజయాన్ని అందించిన కొన్ని విషయాలు ఏమనగా.... 1.బ్రౌజరు ఐ డి లో ప్రథమ గుర్తింపు మీ యొక్క ఈమెయిలు అడ్రస్ మాత్రమె .ఇకపై యూసర్ నేమ్ సైన్ అప్ ,పాస్వర్డ్ మొదలైన ప్రక్రియలు ఏమి అవసరం లేదు.

2. భద్రత మరియు అత్యున్నత యూజర్ అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది - లాగిన్ సమయం లో ఏ రకమైన పాస్వర్డ్ నమోదు చేయనవసరం లేదు. ఏ ప్రదేశం లోనైన మనం సురక్షితంగా పని చేసుకోవచ్చు. అది బహిరంగ ప్రదేశం ఐన కాఫీ షాప్ ఐన కావచ్చు.

3. పూర్తిగా దాని విధానం లో వీకేంద్రీకరణ ఉంటుంది.వ్యక్తులు ఎవరైతే బ్రౌజరు ఐడి ను వారి వెబ్సైటు లలో మరియు పోర్టల్స్ లో అమలుపరుస్తారో వారి పని మరియు ప్రమాణీకరణ పై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇందులో ఇతరుల జోక్యం ఉండదు.

4. ఇప్పటినుండి ఎవరైతే బ్రౌజరు ఐడి ను ఆచరణలోకి తెస్తారో వారు నకిలీ ఈమెయిలు ఐడిలతో సైన్అప్స్ గురించి చింతించాల్సిన అవసరం లేదు.ప్రతి ఈమెయిలు అడ్రస్ కు బ్రౌజరు ఐడి తో చెల్లుబాటు ఉంటుంది.

సరే కాని..బ్రౌజరు ఐ డి ఎలా పని చేస్తుంది??

మీ మనసులోని మనోభావాలను అర్ధం చేస్కున్నా. ఈ వ్యవస్థ గురించి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ముందు కొన్ని నిబంధనలను మీరు అర్ధం చేసుకోవాలి.

1. ప్రైమరీ ఐడెంటిటీ అథారిటీ - మీరు ఎవరి దేగ్గరినుండైతే మీ ఈమెయిలు అడ్రస్ పొందుతారో (జీమెయిల్,హాట్మెయిల్,యాహూ) వారే ప్రైమరీ ఐడెంటిటీ అథారిటీ వ్యక్తులు.

2. రిలైంగ్ పార్టీ - ఎవరైతే బ్రౌజరు ఐడి ను తమ వెబ్సైటులో అమలు పరుస్తారో వారినే రిలైంగ్ పార్టీ అంటారు.

3. ఇంప్లిమెంటేషన్ ప్రొవైడర్ - ఇది బ్రౌజర్ ఐ డి కోసం ఒక స్థానిక మద్దతు కలిపించే మీ బ్రౌజర్ కావచ్చులేదా browserid.org అయినా కావచ్చు. ఈ రెండు బ్రౌజరు ఐడి యొక్క క్లైంట్ సైడ్ అమలును నిర్వహిస్తాయి.

పని చేసే విధానం:

మీ గుర్తింపుకు రూప కల్పన:

1. మొదట్లో మీరు మీ బ్రౌజర్ లో మీ ఇమెయిల్ సర్వీసు ప్రొవైడర్ ఖాతాకు సైన్ఇన్ చేయండి.

2. మీ ఇమెయిల్ సర్వీసు ప్రొవైడర్ నుండి జావా స్క్రిప్ట్ ,క్లైంట్ వైపు ఒక కీ జతను తయారు చేయడానికి ఒక ఫంక్షన్ను తాయారు చేస్తుంది తరువాత పబ్లిక్ కీ ఒక సురక్షిత కనెక్షన్ కోసం సర్టిఫికెట్ ఫై సంతకం చేసి ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ కి పంపబడుతుంది.

3. ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్, పబ్లిక్ కీ మరియు ఈమెయిలు అడ్రస్ సంతకం చేసి అది ఒక ధ్రువీకరణ వ్యవధిని బయటకు ఇస్తుంది మరియు మొత్తం సమూహాన్ని తిరిగి బ్రౌజరు కు పంపుతుంది.

4. బ్రౌజర్ ID లాగిన్ కోసం తర్వాత ఉపయోగపడే గుర్తింపు ను ఏర్పడడానికి బరౌజర్ ప్రైవేట్ కీ తో పాటు తిరిగి తన సమూహాన్ని కాష్ మెమరీ లో నిల్వచేసుకుంటుంది .

గుర్తింపు స్థిరత్వం మరియు నిర్ధారణ

1. బ్రౌజరు ఐ డి తో సైన్ఇన్ ను క్లిక్ చేసినప్పుడు, మీరు ప్రమాణాలు చేసిన ఇమెయిల్ చిరునామాల జాబితా నుండి ఒక ఇమెయిల్ చిరునామా ఎంచుకోండి.

2. అప్పుడు బ్రౌజరు రిలైంగ్ పార్టీ ,ఈమెయిలు అడ్రస్,దాని ధ్రువీకరణ వ్యవధి కలిగి ఉన్న పబ్లిక్ కీ బ్రౌజరు తో జత కట్టి వెబ్ పేజీ కి తిరిగి ఇస్తుంది.

3. ఒక సారి వెబ్ పేజి సర్వర్ ఫై ఉన్నప్పుడు గుర్తింపు సమూహం యొక్క చెల్లుబాటును తనిఖిస్తుంది మరియు అదే సమూహానికి పబ్లిక్ కీ ని ప్రైమరీ ఐడెంటిటీ అథారిటీ నుండి పొందుతుంది.

4. సమూహము లోని సర్టిఫికేట్ సంతకము మరియు ప్రాథమిక గుర్తింపు అథారిటీ నుండి పొందిన దానితో సరిపోల్చి, తనిఖీ చేస్తుంది.

5. వారు మ్యాచ్ అయితే ,ఆ గుర్తింపు నిజమని రిలైంగ్ పార్టీ కి తెలుస్తుంది.

ఇది అర్ధవంతంగా ఉందని ఊహిస్తున్నా .కనీసం ఆ విధంగా ఆశిస్తున్నా .

వినియోగదారుల మధ్య ఒక సాధారణ సందేహం ఏమిటంటే బ్రౌజరు ఐ డి మరియు ఓపెన్ ఐ డి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి??

1. ఓపెన్ ఐ డి కూడా వివిధ సైట్లు మరియు పోర్టల్స్ అంతటా ఒకే గుర్తింపు ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ నిజానికి భిన్నమైనది ఏమిటంటే బ్రౌజర్ ID మీ ప్రాధమిక గుర్తింపు మీ ఇమెయిల్ చిరునామా గా భావిస్తుంది.

2. బ్రౌజరు ఐ డి లో లాగిన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ఐడెంటిటీ ప్రొవైడర్ యొక్క జోక్యం ఉండదు.పబ్లిక్ కీ మ్యాచ్ డిస్కనెక్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు. కావున వినియోగదారులు బ్రౌజరు ఐ డి వాడడం తో వారి ఆన్లైన్ కలాపాలు సురక్షితంగా ఓపెన్ ఐ డి ప్రొవైడర్ లతో గోప్యంగా మరియు జాడ తెలియకుండా ఉంచుతుంది.

3. పాస్వర్డ్ లు నమోదు చేయనవసరం లేదు కావున బ్రౌజరు ఐ డి తో నష్టమేమి ఉండదు. వెబ్ బ్రౌజర్ల లలో బ్రౌజరు ఐ డి ఏకీకరణ మరింత భద్రత మరియు ఉత్తమ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది.

P.S. : బ్రౌజర్ ఐ డి ప్రాజెక్టు మొజిల్లా పెర్సొన అని నామకరణం జరగనుంది , కానీ, డెవలపర్ వైపున ఇంకా బ్రౌజర్ ఐ డి అనే ప్రాజెక్టు పేరు ఉంటుంది.