Te:NeMo-HTML5

From MozillaWiki
Jump to: navigation, search

నెమో వ్యాస అధోభాగము
HTML5
మరల వ్యాస అధోభాగమునకు | ముఖ్య పేజి
క్రాంతి కుమార్ (Kranthi Kumar)
రెహమాన్ (Rahman)
కావ్య (Kavya)

HTML5

ఇటీవల HTML5 గురించి అంతర్జాలం (ఇంటర్నెట్), మ్యగాజిన్లు మరియు వార్త నివేదికలలో మనం చదువుకుంటున్నాం . అసలు HTML5 అంటే ఏమిటి? అలాగే దాని యొక్క ప్రాధాన్యం ఏమిటీ? సరిగ్గా వెబ్ గురించి నేర్చుకోవడం ప్రారంభించాలనుకున్న వారికోసం ఇది ఎలా ఉపయోగపడుతుందన్న అంశం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

HTML అనగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. 1990 లలో వెబ్ అనేదీ అంతగా ప్రత్యేకతని గాని పరిపూర్నతని గాని సంపాదించుకొలేదు. అప్పటిలో వెబ్ లో పుస్తకాలు మరియు పత్రాలు ఏవీ కూడా ఒక ఆచరణలో ఉండేవి కావు. ఉదాహరణకు ఒకవేళ మనకు ఒక పుస్తకం అవసరమైతే వెబ్ లో సుమారు 20 వేళ వాఖ్యాలు కలిగిన పూర్తి పేజీని పొందే వాళ్ళు. వాటిలో చిత్రాలు,గ్రఫిక్స్లు ఏవి కూడాను వచ్చేవి కావు. ఆన్ లైన్ లో చదవడం కంటే పుస్తకం లో చదవడమే సులభంగా ఉండేదీ. ఆ 20 వేళ వాఖ్యాలు చదవడానికి ఆసక్తి చూపించే వారు కాదు. ఇది 20 దశాబ్దాల ముందు పరిస్థితీ.

నేడు HTML5 తో వెబ్ అభివ్రుధి

ఈ దశ అడుగడుగునా మారుతూ వచ్చింది. వెబ్ ను కనుగొన్న వారు(ముఖ్యంగా CERN కి చెందినవారు) పుస్తకంలో ఉన్న ఒక్కొక్క పత్రమును విభిన్న వెబ్ పత్రములుగా (ఒకదాని తర్వాత మరొకదానికి వెళ్ళుటకు వీలుగా) చెయ్యడం ఉత్తమంగా భావింఛి తగిన మార్పులు చేసి అందరికి అందుబాటులో ఉంచారు. ఇప్పుడు దీని ద్వారా మనం ఒక్కోక పత్రమును అర్ధం చేసుకోగల్గుతున్నాం మరియు మనకు ఏ పేజి కి వెల్లాలనుకున్న సులభంగా వెల్లగల్గుతున్నాం. ఒక్కోక పత్రములోని ప్రతి చిన్న విషయమును మునుపటి దానికంటే సులువుగా చూసి, చదివి అర్ధం చేసుకునే విధంగా వెబ్ ను తయారి చేసారు.

హైపర్ టెక్స్ట్ లోని నావిగేషన్ ద్వారా (ఒకదాని తర్వాత మరొకదానికి వెళ్ళుటకు వీలుగా) విభిన్న పత్రములను ఒకే దెగ్గర జతపర్చడం, టెక్స్ట్ ఫార్మాట్ (పుస్తకము యొక్క ముఖ్య భాగములను హంగులు అద్దడం) ను వెబ్ పేజిలో పరిచయం చేయడం వలన మనం ఇప్పుడు టెక్స్ట్ పరిమాణం, బోల్డ్ పదాలు, పేరగ్రాఫ్లు ఇంకా మొదలైన వాటి గురించి తేడాలు గమనిస్తున్నాం. కాలం గడుస్తున్న కొద్ది డెవలపర్లు ఎందుకు గ్రాఫిక్స్ మరియు చిత్రాలు పరిచయం చేయలేదని తమకు తాము ప్రశ్నించుకున్నారు. ఈ ప్రశ్నకు దీటుగా జవాబిస్తూ చిత్రాలు మరియు గ్రాఫిక్స్ ను వెబ్ లో చేర్చారు. ఈ అభివృద్ధి దీనితోనే ఆగిపోలేదు,ఒకరి తర్వాత మరొకరు కొత్త టెక్నాలజీ ని కనుగొని HTML ను 1.0 నుండి 5 వరకు అభివ్రుది చేసారు. ఈ కొత్త టెక్నాలజీ లో వీడియో ఎక్కువ వాడుక లోకి వచ్చింది. ప్రజలు వీడియో ల ద్వారా కొత్త విషయాలను వీక్షించి సులభంగా అర్ధం చేసుకుంటున్నారు.

వెబ్ పేజి లో ప్రతి అంశాన్ని విడి విడిగా గుర్తించడం అవసరం. ఇందుకోసం HTML లో మనం టాగ్స్ ని ఉపయోగిస్తాం. HTML లో ప్రతి విషయాన్నీ ట్యాగ్ చేయడం వలనే HTML ను హైపర్ టెక్స్ట్ మార్క్ అప్ లాంగ్వేజ్ అంటారు. ఒక్కసారి ఆలోచించండి "మీరు మీ పరీక్షకు సిద్ధమైయ్యెటప్పుదు మీరు చదువ వలసిన విషయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయనుకోండి.. అప్పుడు మీరు గుడ్డిగా చదువుతార...?? చదవరు కదా..ఎప్పుడైనా ,ఎక్కడైనా ముఖ్యమైన అంశము చదివినప్పుడు లేదా శీర్షికను మరియు ఉపశీర్షికను చదివినప్పుడు అక్కడ చిహ్నాన్ని పెట్టుకొని చదువుతారు కదా..అప్పుడు మీరు చిహ్నం పెట్టుకున్న విషయాలను గమనించి చదవడానికి సులభంగా చేసుకుంటారు కదా.. అదే ఆలోచనను HTML5 లో పుస్తకం లాగానే ఒక ప్రత్యేక ట్యాగ్ ద్వారా ఆచరణలోకి తెచ్చారు. HTML5 తో పరిచయమైనా మరో ముఖ్యమైన లక్షణం లో ఆడియో ఫార్మటు కి ఒక స్థానిక మదత్తు ఉంది. అది mp3 నుండి wav ఫార్మటు మధ్య ఏదైనా అనుకోవచ్చు.

SVG(స్కైలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్) మరియు MathML ఇప్పటి నుండి ఇన్లైన్ లోకి మారాయి, అంటే వీటిని టాగ్స్ ల కూడా ఉపయోగించుకోవచ్చు. SVG తో డైనమిక్ గ్రాఫిక్స్ మరియు చిత్రాల లక్షణాలను గీయడం కోసం ఒక XML నిర్దేషణ (specification) ఉంది. MathML తో గణిత శాస్త్ర సమీకరణలను చాల సులభంగా రాయగలరు. వెబ్ పేజి లో గణిత శాస్త్ర సమీకరణ ప్రాతినిధ్యం ఎప్పటినుండో సమస్యగా ఉండేదీ. చాల సందర్భాలలో సమీకరణ కోసం వీటిని ఉపయోగించడం మొదలు పెట్టారు.

HTML5 ఆఫ్ లైన్ అనువర్తనాన్ని అమలు మరియు నిలువను అనుమతిస్తుంది. HTML5 తో వచ్చే అనేక ఇతర లక్షణాలలో టైమ్డ్ మీడియా ప్లే బ్యాక్, డాక్యుమెంట్ ఎడిటింగ్, డ్రాగ్ అండ్ డ్రాప్, జిఒలొకేషన్ ఉంటాయి. HTML5 కు సంభందించి అనేక సైట్లు అందుబాటులో ఉండడం వలన మీరు నేర్చుకొని ఆదరగొట్టడానికి సిధం అవ్వండి.