Te:NeMo-Firefox: Difference between revisions

From MozillaWiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:

నెమో వ్యాస అధోభాగము
ఫైర్ ఫాక్స్ యొక్క కథ

[[NeMo/Articles| మరల వ్యాస అధోభాగమునకు ]] | [[NeMo|ముఖ్య పేజి ]]
[https://www.facebook.com/sahithi.gangaraju?fref=ts సాహితి (Sahithi) ]
[https://www.facebook.com/pranathireddy.koppula?fref=ts ప్రణతి రెడ్డి (Pranathi Reddy)]
[ శృతి  (Shruthi)]

==ఉపోద్ఘథము==
==ఉపోద్ఘథము==

Revision as of 17:42, 22 February 2013

నెమో వ్యాస అధోభాగము
ఫైర్ ఫాక్స్ యొక్క కథ
మరల వ్యాస అధోభాగమునకు | ముఖ్య పేజి
సాహితి (Sahithi)
ప్రణతి రెడ్డి (Pranathi Reddy)
[ శృతి (Shruthi)]

ఉపోద్ఘథము

1994లో నెట్ స్కేప్ నావిగేటర్ అనే సాఫ్ట్ వేర్ ని మోసయిక్ కిల్లర్ అనే సంస్థ రూపొందించింది. తదుపరి 1998లో మోసయిక్ కిల్లర్ సంస్థ నెట్ స్కేప్ ను ఓపెన్ సోర్స్ లో విలీనం చేసింది . అలా మొజిల్లా ఫైర్ ఫాక్స్ కి పునాది పడింది . కాని 2002 సంవత్సరం వరకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెలుగు లోకి రాలేదు. పునాది పడిన 10వ సంవత్సరం తరువాత, 2004 లో మొజిల్లా ఫైరుఫాక్సు 1.0 సంపూర్ణంగా వెలువడింది .

ఆవిర్భావము

మైక్రో సాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్పలోరర్ కంటే ముందు నెట్ స్కేప్ ని విరివిగా ఉపయోగించేవారు. ఈ నెట్ స్కేప్ నుంచే ఫైర్ ఫాక్స్ ఉద్భవించింది. కంపెనీ లోపల ఈ సాఫ్ట్ వేర్ ని మొజిల్లా అని పిలిచేవారు. నెట్ స్కేప్ సంస్థ వారు నావిగేటర్ యొక్క లైసెన్స్ ని ఓపెన్ సోర్స్ కి అందజేసారు .

ఓపెన్ సోర్స్ అనగా , ఎవరైనా చూడొచ్చు ..ఎవరైనా వాడుకోవచ్చు .ఈ సమూహమే 2003 లో మొజిల్లా సంస్థగా ఏర్పడింది .అంత పద్ధతి ప్రకారం జరిగితే , మొజిల్లా వారు ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజరు ని విడుదల చేసేవారు కాదు. నెట్ స్కేప్ నావిగేటర్ లాగ మొజిల్లా కూడా అభివృధి దశలోనే చాల సమస్యలను ఎదురుకోవలసి వచ్చింది. ఫీచర్ క్రీప్ మరియు బ్లోట్("feature creep" or"bloat") వంటివిచాల ఝటిలమైన సమస్యలుగా మారాయి.

ఇదే సమయంలో, ఫైర్ ఫాక్స్ ప్రాజెక్ట్ ని ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్ గా దేవ్ హ్యత్(Dave Hyatt),జో హేవిత్(Joe Hewitt), చనయాల్(Chanial)మరియు బ్లేక్ రోస్స్ (Blake Ross)స్వీకరించారు. కంప్యూటర్ పట్ల పిన్న వయస్సు నుండే ఉత్సాహం కలిగిన బ్లేక్ రోస్స్ (Blake Ross) గారు ఫీచర్ క్రీప్ ని అంగీకరించలేదు. వారే స్వయంగా స్ట్రీమ్ లైన్(Stream Line) మరియు సింపుల్ వెర్షన్ (Simple Version) వంటి లక్షణాలున్న మొజిల్లా వంటి బ్రౌజరు ని అభివృధి చేయసాగారు. 2003లో రోస్స్(Ross) మరియు బెన్ గూడ్గేర్(Ben Goodger)సాఫ్ట్ వేర్ అభివ్రుది లో కీలక పాత్ర వహించిన దేవ్ హయత్ (Dave Hyatt) గార్ల వల్ల అభివృధి తొందరగా జరిగింది.

మొజిల్లా ని అభివ్రుది చేయువారు, నెట్ స్కేప్ యొక్క వ్యాపార అవసరములు మొజిల్లా యొక్క ఉపయోగాన్ని తగ్గించాయని భావించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మొజిల్లా వారు బ్లోట్ [1] ని ప్రత్యేకంగా రూపొందించారు .ఈ బ్లోట్ ద్వార మొజిల్లా సుట్ యొక్క స్థానాన్ని భర్తీ చేయదలిచారు. 2003లో మొజిల్లా సంస్థ వారు తమ దృష్టి ని ఫైర్ ఫాక్స్ మరియు థండర్బర్డ్ మీద కేంద్రీకరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మొజిల్లా సంస్థ వారు మొజిల్లా సూట్ ని పూర్తి గా నిషేదించినప్పటికి 2006 వరకు "సి మంకీ" పేరుతో మొజిల్లా సూట్ యొక్క కొత్త వెర్షన్లువచ్చాయి. ఫెబ్ 5 న 2004 లో ఐ .టి వారు ఇది చాల నమ్మ దగిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ అని చెప్పారు.

నామకరణం

ఫోనిక్స్:

ఫైర్ ఫాక్స్ ని ప్రయోగాత్మక శాఖగా మారిన తరువాత దానికి చాల పేర్లు మార్చబడినవి. ఫైర్ ఫాక్స్ ని మొత్తం అభివృధి చేసాక 2002 లో ప్రజలచే పరీక్షింప బడడానికి ఫోనిక్స్ అనే పేరుతో విడుదల చేసారు. కాని ఏప్రిల్ 14 2003 లో గుర్తింపు గొడవ వల్ల ఈ పేరు మార్చబడినది.

మంటికోర్: ఫోనిక్స్ , మొజిల్లా యొక్క సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా అభివృది చెందింది. పెద్ద అనువర్తనాల మీద దృష్టి సారించకుండా ఫోనిక్స్ చిన్న అనువర్తనముల వరకే పరిమితం ఐనది. ఫోనిక్స్ కేవలం వెబ్ బ్రౌసింగ్ మీద కేంద్రీకృతం ఐనది. బ్లేక్ రోస్ మరియు డేవిడ్ హయత్ ల ఫోనిక్స్ ఎటువంటి లాభాలను ఆశించకుండా.. భద్రత మరియు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బ్రౌజరు వినియోగదారుడికి పూర్తిగా ఉపయోగపడే విధంగా రూపొందించారు .

ఫైర్ బర్డ్ :

ఏప్రిల్ 2003వ సంవత్సరంలో మొజిల్లా వారు ఫైర్ బర్డ్ ని ఒక విశిష్టమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. ఈ ఫైర్ బర్డ్ తనంతట తానుగా ఫోనిక్స్ వాళ్ళ వచ్చే ప్రతికూల పరిస్థితులను ఎదురుకోగలదు. ఫైర్ బర్డ్ అనే పేరుకు చాల సంస్థల వారు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా ఫైర్ బర్డ్ డేటా బేస్ అనే పేరు ఉండటం చేత మొజిల్లా సంస్థ వారు ఫైర్ బర్డ్ కి ముందు మొజిల్లా అని జత చేసారు. అలా అది మొజిల్లా ఫైర్ బర్డ్ గా పేర్పొందింది. ఇదే సమయంలో ఫైర్ బర్డ్ డేటా బేస్ యొక్క పేరు ఐబిఫోనిక్స్ గా మార్చబడింది. 1984 లో స్థాపించబడిన ఇంటర్ బేస్ సాఫ్ట్ వేర్ సంస్థ 1991లో బోర్ ల్యాండ్ సంస్థ తో కలిసి ఫైర్ బర్డ్ ని ఉచిత ఓపెన్ సోర్స్ గా 2000లో ప్రారంబించారు.

ఫైర్ ఫాక్స్:

ఫిబ్రవరి 9 ,2004లో చివరి సారిగా ఈ బ్రౌజరు యొక్క పేరు మార్చబడినది. ఈ ప్రాజెక్ట్ యొక్క పేరును మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని మార్చారు . ఫైర్ ఫాక్స్ అనగా ఎర్రని పాండా అని అర్థం. ఫైర్బర్డ్ అనే పదానికి ఫైర్ ఫాక్స్ అనే పదం చాలా దెగ్గరగా ఉంది కనుక ఈ పేరుని ప్రతిపాదించారు. ఫైర్ ఫాక్స్ అనే పేరు కంప్యూటర్ పరిశ్రమ లో విభిన్నమైన పేరు కనుక ఇక ఈ పేరు మార్చనవసరం లేదని భావించారు. కావున డిసెంబర్ 2003 లో మొజిల్లా సంస్థ వారు"ఫైర్ ఫాక్స్ " అనే పీరుకి పేటెంట్ హక్కులను పొందారు . ఈ పేటెంట్ పద్ధతి పూర్తి కావడానికి కొన్ని నెలల వ్యవధి పట్టింది. ఇంతలో చార్లటన్ అనే సంస్థ ఈ పేరును ట్రేడ్మార్క్ చేయడం జరిగింది. చార్లటన్ వారు తమ లైసెన్స్ ను అందజేయడంతో ఈ సమస్య సర్దుమల్లింది .

సంస్కరణలు(Versions)

ఫైర్ ఫాక్స్ చాల వెర్షన్లలో వెలువడింది. ప్రథమంగా నవంబర్ 9 2004 లో వెర్షన్ 1.0 విడుదల చేయబడింది. ఆ తరువాత ఫోనిక్స్ యొక్క భద్రతను పెంచి మొజిల్లా వారు నవంబర్ 29, 2005లో వెర్షన్ 1.5 ని విడుదల చేసారు. వెర్షన్ 2.0 అక్టోబర్ 24,2006లో. వెర్షన్ 3.0 జూన్ 17,2008లో. వెర్షన్ 4.0 మార్చ్ 22,2011లో విడుదల చేసారు. వెర్షన్ 5.0 నుండి విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయి. అలా జనవరి 31,2012లో మొజిల్లా యొక్క వెర్షన్ 10 విడుదలచేయబడినది. అత్యంత ఆధునికమైన వెర్షన్ 19 వ వెర్షన్ల ఫిబ్రవరిలో విడుదల చేసారు .

ముఖ్యపదాలు

1.సాఫ్ట్ వేర్ బ్లాట్ అనే ప్రక్రియతో కంప్యూటర్ లో కొత్త విషయములను చేర్చగా సామాన్యునికి అవసరం లేను లక్షణములు పెరుగుచుండెను .అంతేకాక కంప్యూటర్ లో ఉన్న వస్తు సంపదను ఎక్కువగా అవర్సారం లేని వాటికి ఉపయోగించేది. 2.మొజిల్లా సూట్ :ఇందులో మెయిల్ ,వార్తలు , మరియు సీమంకీ లోని అనేక అంశాలు కలవు. 3.ఫైర్ ఫాక్స్ రెడ్ పాండా కి మరో పేరు . రెడ్ పాండా అంతరిస్తున్న జాతులలో ఒకటి . ఈ పాండా హిమాలయాల్లో , చైనా మరియు మయాన్మార్ లో కనపడును .