Te:NeMo-Mozilla

From MozillaWiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

నెమో వ్యాస అధోభాగము
మొజిల్లా అంటే??
మరల వ్యాస అధోభాగమునకు | ముఖ్య పేజి
అనిల్ కుమార్(Anil Kumar)
హితేష్ కుమార్(Hitesh Kumar)
చిట్టి కిరణ్ (Chitti Kiran)

మొజిల్లా అంటే

మొజిల్లా !! మొదటిసారి ఈ పేరు వినగానే మొజిల్లా నా .... గోడ్జిల్లా నా ... అనే సందేహాన్ని నేను చాల మంది లో గమనించాను. హ హ హ...సందేహాలు కల్గడం సహజమే, నేను కూడా మద్దత్తు తెల్పుతున్న..! ఉమ్మ్... నేను మొదటిసారి మొజిల్లా కి నా తరపున స్వచ్చందంగా సేవలు అందించాలని అనకున్న.., ఆ క్రమం లోనే మొదట నెమో (NeMo- News Mozilla) ప్రాజెక్ట్ లో పాలుపంచుకోవాలనుకున్న. ఈ విషయం తెలియగానే నా సహవిధ్యర్థులో నా పైన ఓ రకంగా గౌరవం పెరిగిందనే చెప్పాలి. వాళ్ళంత నా దేగ్గరకువచ్చి "రేయ్.. మొజిల్లా ఫైరుఫాక్సు ఆ..?? అది చాల వేగంగా ఉంటుంది. నేను దాన్ని సాధారణంగా ఎప్పుడు వాడుతుంటాను". ఈ మాటలు వినగానే ...నిజంగా నేను చాల చేసేస్తున్నాను అనిపించింది, ఈ మాటలు ,ఆ గౌరవం ఓ కీర్తి కిరీటం ల అన్పించిందంటే నమ్మండి . మన లో మన మాట .. అమ్మైలైతే "హే అతనూ మొజిల్లా కి పనిచేస్తుండు,ఓపెన్ సోర్స్ కి ... చాల మంచి వ్యక్తిత్వం అనుకుంటా స్మార్ట్ కదా!!" ఈ మాటలు మంచి జోష్ ఇచ్చేసాయి. ఇవన్నీ నా అనుభవాలు ... వీటిని నేను పొందడానికి కారణమైన మొజిల్లా గురించి నేను మీకు తెల్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది!!

మొజిల్లా !! అవును!!!!!!

ప్రజలకు ఇప్పటి వరకు మొజిల్లా గురించి తెలిసింది కాకుండా మరింత ఎక్కువ తెలుసుకోవచ్చు . మొజిల్లా డబ్బులు కోసం పని చేసే సంస్ధ కాదు. కేవలం వెబ్ లో నిష్కాపట్యత(openness), ఆవిష్కరణ(Innovation) మరియు అవకాశం(opportunity) ఇవ్వడానికి మొజిల్లా మేనిఫెస్టో తాయారు చేయబదినది. సరే!! ఇపుడు మనం ఓపెన్ సోర్స్ మరియు "ఓపెన్ వెబ్" గురించి తెలుసుకుందం. సమయం గడిచేకొద్ది ,వెబ్ టెక్నాలజీ పెరిగే కొద్ది ప్రజలు కూడా ఓపెన్ సోర్స్ మరియు ఓపెన్ వెబ్ గురించి మరింత జ్ఞ్యనాన్ని పెంపోదించుకుంటున్నారు. కానీ ఎవరికైతే వీటి ఫై అభిరుచి ఉందో వారికి సరైన సహాయం లభిచడం లేదు. దీనికై మొజిల్లా సహాయం చేయుటకు ముందుకు వచ్చింది.

మొజిల్లా కొరకై ఒక చిన్న అడుగు,మనిషి యొక్క గొప్ప విజయానికి నిదర్శనం!!!

నెట్ స్పేస్ నావిగేటర్ అనేది ఒక బ్రౌజరు ఉండేది. ఆ బ్రౌజరు ప్రాజెక్ట్ కి మొజిల్లా అనేది రహస్య పేరు ఇవ్వడం జర్గింది.1998 వ సంవత్సరంలో నెట్స్కేప్ కి ఆదరణ తగ్గిపోవడంతో నెట్స్కేప్ వారు "మొజిల్లా ఫౌండేషన్" స్థాపించారు.'ఓపెన్ సోర్స్' మరియు 'ఓపెన్ వెబ్' తో ఒక బ్రౌసర్ ని తయారు చేయ దల్చుకున్నారు. ఇప్పుడు మొజిల్లా ఒక సాధారనమైన సంస్థ కన్నా ఎక్కువగా ఎదుగసాగింది. కొద్ది సంవత్సరాల్లో చాలా సంఘాలు ప్రపంచ చుట్టు మొదలై ప్రతి ఒక సంఘం బ్రౌజరు తయారీ కి దోహద పడ్డాయి. వీటితో పాటు ఆలోచనశక్తి పెంపోదాయి. అందరు ఒక లక్ష్య సాధనకు నడువ సాగారు అది "" ఒపెనెస్స్ ఆఫ్ వెబ్" మరియు " సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్". నిజానికి 2001 లో 'మొజిల్లా 1.0' విడుదల చేసారు. మొజిల్లా 1.0 కి పెద్దగా ఆదరన లభించలేదు.మూడు సంవత్సరంల తరువాత "ఫైర్ఫాక్స్" గా కొత్త బ్రౌజరు ని తయారు చేసీ విదుల చేసారు. ఫైర్ఫాక్స్ 1.0 విడుదల కాగానే ఒకే సారి 'ఒక మిలియన్' డౌన్ లోడ్స్ జరిగాయి మరియు దీని వల్ల ఇతర సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ "థండర్ బర్డ్ "- థీ ఈమెయిలు మెసెంజర్ మరియు సి మంకీ అప్లికేషన్ సూట్ వేల్లుగోలినికి వచ్చాయి. మొజిల్లా కేవలం ఫైరుఫాక్సు చేయుటకు మాత్రమే పనిచేయలేదు కాని 'ఓపెన్ సోర్స్' మరియు 'ఓపెన్ వెబ్ ' గురించి ఒక నాణ్యమైన అనుభావాన్ని ఇచ్చింది.ఇప్పుడు వెబ్ చాలా స్టాండర్డ్స్ కి సహకరిస్తుంది. ఇంకా చాలా స్పష్టత కొరకు చిత్ర పట్టాలు మాత్రమే కాకుండా వెబ్ సైట్ తో శబ్దం మరియు వీడియో ఎడిటింగ్ ఇంకా ఆన్లైన్ డాక్యుమెంటేషన్ ఇలా ప్రతి ఒకటి క్లౌడ్ ద్వారా సాధ్యమైంది (అంటే ప్రతి ఒకటి ఆన్లైన్ లో లబిస్తునవి ) మొజిల్లా ప్రతి ఒక వెబ్ స్టాండర్డ్స్ ని అందరికి అందిచుటకు కృషి చేస్తుంది . దీనికై 'వెబ్ ఫార్వర్డ్ ' మరియు 'డ్రం బీట్ ' అన్నే ప్రాజెక్ట్స్ ని విడుదల చేసింది.గత పది సంత్సరాలలో మొజిల్లా ఓపెన్ సోర్స్ లో ప్రత్యేక స్థానాన్ని దకించుకుంది. మొజిల్లా ప్రతి ఒకరికి అవకాశాని అందిస్తూ ప్రతి ఒకరి ఆలోచనలను అబినందిస్తున్నది. మొజిల్లా అందరి శక్తిని మరియు ఆలోచన విదానాన్ని తో ఓపెన్ స్టాండర్డ్ మరియు ఓపెన్ వెబ్ కొరకై పోరాటం చేస్తున్నది .మొజిల్లా ఓ మొదలు కాదు. ఓ మార్పు ,ఒక విధంగ చెప్పలంటే ఓ చైతన్యం అని చెప్పవచ్చు !