Te:NeMo-Opensource

From MozillaWiki
Jump to: navigation, search

నెమో వ్యాస అధోభాగము
ఓపెన్ సోర్స్ అంటే ఏమిటి?? ?
మరల వ్యాస అధోభాగమునకు | ముఖ్య పేజి
ద్వారక నాథ్ (Dwaraka Nath)
మేరాజ్ ఇమ్రాన్ (Meraj Imran)
హేమ భాను ప్రియ (Hema Bhanu Priya)

ఓపెన్ సోర్స్

నా పేరు ఇమ్రాన్.


నేను ఈ పదాన్ని ఎక్కడో వినట్టున్నానే... అంతర్జాల పరిజ్ఞానం ఉన్న వారికీ ఈ పదము అంత కొత్తగా ఏమి అనిపించక పోవచ్చు. ఒకరికి తెలిసిన విషయము మరొకరికీ తెలియాలని లేదు కదా... పదండీ ఓపెన్ సోర్స్ గూర్చి తెలుసుకుందాం మరి. ఓపెన్ సోర్స్ కు ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాఈ వ్యాసం ద్వారా సాఫ్ట్ వేర్ కు సంబందించిన ఈ పదం గూర్చి తెలుసుకుందాం. ఏమంటారు... మొదలేడ్దామా ?? సంయుక్త సాఫ్ట్ వేర్ పరిజ్ఞాన అభివృద్ధి కోసం ఈ ఓపెన్ సోర్స తోడ్పడుతుంది. సాఫ్ట్ వేర్ కోడ్ ను ప్రత్యేక్షంగా సామాన్యులు కూడా చూసి తగిన మార్పులు చేర్పులు చేసి మరల వినియోగించుకునే సువర్ణవకాశం ఓపెన్ సోర్స్ మనకు అందిస్తుంది. అంతే కాదండోయ్.. నూతన భావాలను కూడా ప్రోత్సహిస్తుంది. లాభాలకు అతీతంగా స్వప్రయోజనాలకు ఆశించకుండా సామాన్యుల ఆలోచనలకు అద్దం పడుతుంది. వేల కొద్ది కార్యకర్తలు లక్ష్య సాధన మరియు అంకిత భావం గల ప్రోగ్రామర్లు ఈ సంఘానికి సేవలు అందిస్తున్నారు. .మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజరు, ఫెడోర మరియు లినక్సు ఆపరేటింగ్ సిస్టం లు ఈ కోవకు చెందినవే. ఓ మనిషి యొక్క లక్షణాలు మరియు ఆలోచనలు తెలిస్తే చాలదు కదా... పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం కూడా అవసరమే... మరి ఆలస్యమెందుకు, తెలుసుకుందామ??

ఓపెన్ సోర్స్ మీద పరిశోధన సుమారు 40 ఏళ్ళ క్రితమే మొదలైంది. అసలు కథ ఏంటంటే

ఐ బీ యం అనే సంస్థ మొదటి తరం కంపూటర్లు తయారీ కీ శ్రీకారం చుట్టింది. వాటికి తగిన సాఫ్ట్ వేర్ లు తయారిని కూడా ప్రారంభించింది. అందరు ఉచితంగా వినియోగించుకునే లాగ మరియు అందరికి అందుబాటుగా ఉండే విధంగ ఈ సాఫ్ట్ వేర్ యొక్క నిర్మాణం జరిగింద.అందరికి చేరువైన సమయముల ఐ బీ యం (IBM) సంస్థ 1970 లో అనుకోని విధంగా ఈ సాఫ్ట్ వేర్ కు వెల కట్టడం ప్రారంభించింది. ఎటువంటి మార్పులు, అభిప్రాయ సేకరణ కు ఆసక్తి కనబరచటం ఆపేసింది. " అన్ని మనకి అనుకులంగ ఉంటె దాన్ని జీవితం అని ఎలా అంటాం", ఏమంటారు?? సర్లెండి మన కథ లోకి వచ్చేద్దం. అటువంటి సమయంలో ఉచిత సాఫ్ట్ వేర్ వినియోగం కై ఉద్యమం మొదలైంది. యం ఐ టి (Massachusetts Institute of Technology) కు చెందిన ప్రోగ్రామరు రిచార్డ్ స్టాల్మన్ “జి ఎన్ యు” ప్రాజెక్టు ను తలపెట్టారు. సాఫ్ట్ వేర్ మరియు ఆపరేటింగ్ సిస్టంలను నలుగురు ఉచితంగ వినియోగించుకునే విధంగా సృష్టించడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము. ఉచిత సాఫ్ట్ వేర్ వినియోగం, సవరింపులు చేసి ఉపయోగించడం ప్రతి సామాన్యుడి ప్రధాన హక్కు అని రిచార్డ్ స్టాల్మన్ భావించారు. అదండీ కథ.

ఇదంతా నాకిప్పుడు ఎందుకు..?? అనే ప్రశ్న మీలో కలిగిఉంటుంది. మనలో ఎంతో మందికి ఇలాంటి ప్రశ్న కలగడం సహజం. కానీ, ఒక్క సారి ఆలోచించండి. చాల వరకు సాఫ్ట్ వేర్ లు

యాజమాన్య హక్కులు కలిగి ఉంటాయి. అన్తెన్దు కండి.. మనం ఉపయగించే మీడియా ప్లేయర్లు, ఆపరేటింగ్ సిస్టము, కంప్యూటరు లో ఆడే గేమ్స్ ఏదైనా ఈ కాలం లో ఎంతో కొంత వెచ్చించి ఖరీదు చేయాల్సిందే. సంపన్నులైతే వెచ్చించగలరు. మరి సామాన్యుల పరిస్థితో?? కనీస అవసరాలను కూడా ఏర్పర్చుకోలేని ప్రజలు ఉన్న కొన్ని దేశాలల్లో సాఫ్ట్ వేర్ ఖరీదు చేసే నాధులు ఎవరుంటారు?? ఈ సాఫ్ట్ వేర్ లను యాజమాన్యం చేయటం వలన ఆలోచనలకు కళ్ళం వేసినట్టే...!! సామాన్యుడి నుండి పరిశోధకుని వరకు ఓపెన్ సోర్స్ యొక్క ప్రాముఖ్యతని గ్రహిచలేక పోయే అవకాశము ఉంది. ఒకసారి ఊహించండి.. మనం వినియోగించే అంతర్జాలం కూడా యాజమాన్య హక్కు కల్గీ ఉంటే?? అమ్మో.. ఈ ఆలోచనే దడపుట్టించేలా లేదు?? ఈ ప్రపంచమే స్తంబించి ఉండేది. యాజమాన్య హక్కు గల సాఫ్ట్ వేర్ కూడా మనపై ఇలాంటి ప్రభావాన్నే చూపిస్తాయి. ఉచితసాఫ్ట్ వేర్... అదేనండి ఓపెన్ సోర్స్ ఎంత సులభాతరమో కదా... ఓపెన్ సోర్స్ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుందీ. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు నచ్చిన, మీరు మెచ్చిన మరియు మీ ఆలోచనలకు తగినట్టుగా సాఫ్ట్ వేర్ రూపొందించవచ్చు. ఐబాబోయ్ ఆశ్చర్యపోకండి. ఇంక ఎన్నో ప్రత్యేకతలు ఓపెన్ సోర్స్ లో దాగి ఉన్నాయి .యాజమాన్యపు హక్కు గల సాఫ్ట్ వేర్ కొనుక్కోవల్సీ వస్తుండడం తో వినియోగదారులు పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని వలన తయారిదారులు మరియు వినియోగదారులు నష్టపోగలరు.

సమాజానికి మరియు మానవ జాతి యొక్క అభివృద్ధి కి ఈ ఉచితసాఫ్ట్ వేర్ వినియోగము మరియు ఓపెన్ సోర్స్ ఉద్యమము ఎంత గానో దూహదపడుతాయి . అంతర్జాలం యొక్క శక్తి, వెబ్ మరియు కంప్యూటింగ్ మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి. అందరికీ అన్ని వేళల సద మీ సేవ లో - ఓపెన్ సోర్స్.